Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మాజీ సీఐ నాగరాజుకు మరో ఉచ్చు.. క్రాంతి కుమార్ ఆత్మహత్య కేసులో కేసు నమోదు

Former CI Nagaraju faces another case in Kranthi Kumar suicide case
Advertisement
  • క్రాంతి కుమార్ ఆత్మహత్య కేసులో ఏ1గా చేర్చిన పోలీసులు
  • ఆత్మహత్యకు ప్రేరేపించడం, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద సెక్షన్లు
  • మృతుడి సెల్ఫీ వీడియో, కుటుంబ సభ్యుల వాంగ్మూలంతో కేసులో మార్పు
  • సాయి కృష్ణ కస్టడీ మృతి కేసులో సస్పెండ్, అరెస్టయిన వైనం
Advertisement
ఎన్టీఆర్ జిల్లాలో సంచలనం సృష్టించిన క్రాంతి కుమార్ ఆత్మహత్య కేసులో మాజీ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) నాగరాజుపై మరో కేసు నమోదైంది. మృతుడు రికార్డ్ చేసిన సెల్ఫీ వీడియో ఆధారంగా, క్రాంతి కుమార్ ఆత్మహత్యకు నాగరాజు వేధింపులే కారణమని నిర్ధారించిన పోలీసులు కేసులో మార్పులు చేశారు. ఆత్మహత్యకు ప్రేరేపించడంతో పాటు ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కృష్ణలంక పోలీసులు ఆయనపై కొత్త సెక్షన్లు నమోదు చేశారు.

పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకునే ముందు క్రాంతి కుమార్, మాజీ సీఐ నాగరాజు తనను వేధించారని ఆరోపిస్తూ ఒక సెల్ఫీ వీడియో రికార్డ్ చేశారు. ఈ వీడియో వెలుగులోకి రావడంతో కేసు కీలక మలుపు తిరిగింది. నార్త్ ఏసీపీ సత్యానందం మృతుడి కుటుంబ సభ్యుల నుంచి వాంగ్మూలం సేకరించి, గతంలో నమోదైన అనుమానాస్పద మృతి కేసును సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

కాగా, రౌడీ షీటర్ సాయి కృష్ణ కస్టడీ మృతి కేసులో నాగరాజు ఇప్పటికే సస్పెన్షన్‌కు గురై, అనంతరం అరెస్టయ్యారు. ప్రస్తుతం ఆయన రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే.                                
Advertisement
Advertisement
Nagaraju
Kranthi Kumar suicide case
NTR district news
Krishnalanka police
SC ST Atrocity Act
Former CI Nagaraju case

More Telugu News